సీఎం చంద్రబాబుకు కానుకగా ముద్దు
ప్రపంచంలోనే రెండు నదులను అనుసంధానం చేసిన ఏకైక మగాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రముఖ సినీ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రస్తుతించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాలలో ఆయన తళుక్కున మెరిశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తనకు అన్నయ్య వంటి వాడన్నారు. ఆయనకు ఎప్పటి నుంచో ఓ కానుక ఇవ్వాలని ఉందని, అందరి సమక్షంలో ఇస్తానని దగ్గరకు వెళ్లి ముఖ్యమంత్రి బుగ్గన ముద్దు పెట్టాడు. దీంతో సభికులందరూ పెద్దగా నవ్వారు.













