తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం
తిరుమల ఆలయంలో ఉగాది ఆస్థాన వేడుకలు వైభవంగా జరిగాయి. వేకువజామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించాక ఆలయాన్ని శుద్ధి చేశారు. తోమాల, అర్చనసేవలను ఏకాంతంగా జరిపారు. అనంతరం 7 గంటలకు శ్రీవారి ఉత్సవర్లను ఆలయంలోని బంగారువాకిలిలో సర్వభూపాల వాహనంపై గరుడాళ్వారుకు అభిముఖంగా అశీనులను చేశారు. ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడిని వేంచేపు చేశారు. ఆస్థానం నిర్వహించి పండితులు పంచాంగ శ్రవణం చేశారు. నూతన తెలుగు సంవత్సరాదిలో భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి జరగాలని టీటీడీ ఈవో సాంబశివరావు ఆకాంక్షించారు.













