శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం తెలుగునూతన సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆనంద నిలయంలో ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించనున్నారు. బంగారువాకిలిలో బుధవారం రాత్రికి పంచాంగశ్రవణం, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం సందర్భంగా ఆలయంలో జరిగే ఆర్జితసేవలు సహస్రకళశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అర్చన, తోమాల ఏకాంతంగా నిర్వహిస్తారు.







