శ్రీవారి లడ్డూకు లైసెన్స్
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం లైసెన్స్ తీసుకుంది. గతంలో అనుమతి తీసుకునేందుకు నిరాకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం, ఇప్పుడు లైసెన్స్ తీసుకోవడం విశేషం. లడ్డూ నాణ్యత విషయంలో ఓ భక్తుడు చేసిన ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీకి వచ్చినపుడు వారిని టీటీడీ బృందం పోటు లోపలికి అనుమతించలేదు. లడ్డూని ప్రసాదంలా చూడాలి తప్ప ఆహారపదార్థంలా చూడొద్దని అధికారుల బృందాన్ని వెనక్కి పంపించిన టీటీడీ, ఇప్పుడు సైలెంట్‌గా లైసెన్స్ తీసుకోవడం విశేషం. భక్తుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు లడ్డూ ప్రసాదం తయారీపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ గుట్టుచప్పుడు కాకుండా పుడ్ సేఫ్టీ అధారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందింది.








