రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం సోమవారం రికార్డు స్థాయిలో సమకూరింది. పాత పెద్ద నోట్లు రద్దు తర్వాత తొలిసారిగా రూ.5 కోట్లు దాటింది. స్వామి వారికి భక్తులు ఆదివారం సమర్పించిన కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానం లెక్కించగా ఈ ఆదాయ వివరాలు వెల్లడయ్యాయి. యాత్రికుల రద్దీ అధికంగా ఉండడంతో పాటు కానుకలన్నీ లెక్కించాలని టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశించారు. నోట్లన్నీ పూర్తి స్థాయిలో లెక్కించడంతో ఆదాయం భారీగా పెరిగినట్లు పరకామణి డిప్యూటీ ఈవో రాజేంద్రుడు తెలిపారు.







