వైభవంగా శ్రీవారి గరుడసేవ
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని పున్నమి గరుడసేవ బుధవారం రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు తిరుమల పుణ్యక్షేత్రంలో వైభవంగా సాగింది. ప్రతి పున్నమికి శ్రీవారి గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో గరుడసేవను తిలకించలేని భక్తులకు ఈ పున్నమి గరుడసేవ ఎంతో దోహదపడుతుంది. ఈ నెల 23వతేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో ఈ నెల 27వ తేదీన జరిగే గరుడసేవ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.








