ఆవేదనతోనే అలా అన్నా!
నంద్యాల సభలో చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలపై జగన్ ఈసీకి వివరణ ఇచ్చారు. కేవలం ఎన్నికల హామీలను చంద్రబాబు అమలు చేయనందునే ఆవేదనతో అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని సృష్టం చేశారు. నంద్యాల ఎన్నికల ప్రచారసభలో ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదంటూ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేగింది. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో తన వ్యాఖ్యలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ జగన్కు నోటీసులు పంపింది. ఈసీ ఆదేశం మేరకు జగన్ వివరణ ఇచ్చారు.








