సీఎం చంద్రబాబును రాష్ట్రపతి చేయాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సూచించారు. తిమరుల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా పలుమార్లు వదులుకున్నారని గుర్తు చేశారు. ఇతరులను ప్రధానులుగా, రాష్ట్రపతిగా ఎంపిక చేసి చక్రం తిప్పారని, దేశంలో ఇంతటి ఖ్యాతి గడించిన సీనియరు నేతను రాష్ట్రపతి చేయాల్సిన అవసరం ఉందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలను కుమారుడు నారా లోకేశ్‌కు అప్పగించి, చంద్రబాబు రాష్ట్రపతిగా ఎన్నికవడం ద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు.













