ఇంటింటికీ తెలుగుదేశం ప్రారంభం
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం తెట్టంగి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆ గ్రామం పసుపుమయమైంది. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు, బ్యానర్లే కనిపించాయి.








