పునర్విభజన వస్తోంది… సిద్ధంగా ఉండాలి
శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఖాయంగా జరుగుతుందని, దానికి అందరూ సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే వారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. తనకున్న సమాచారం ప్రకారం పునర్విభజన పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించుకుందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశముందని అన్నారు.








