TDP MPs: టీడీపీ ఎంపీలతో స్పీకర్ ఓం బిర్లా సమావేశం
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) వరుసగా రెండోరోజూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలతో (TDP MPs) భేటీ అయ్యారు. పార్లమెంటు నిర్వహణ తీరుపై ఎంపీల అభిప్రాయాలు తెలుసుకునే క్రమంలో రోజూ కొందరు ఎంపీలతో సమావేశమవుతున్న ఆయన ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasulu Reddy), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెన్నేటి కష్ణప్రసాద్, బైరెడ్డి శబరి, కేశినేని శివనాథ్లతో భేటీ అయ్యారు. సభా కార్యకలాపాలు మరింత ఫలవంతంగా నిర్వహించేందుకు వారి సూచనలు, సలహాలు అడిగి తెలుసుకున్నారు. తొలిసారి లోక్‌సభ (Lok Sabh)కు వచ్చినవారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని వారు కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు శాలువా కప్పి గౌరవించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






