హెరిటేజ్ డైరెక్టర్ పదవికి లోకేశ్ రాజీనామా
హెరిటేజ్ సంస్థలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్లో ప్రకటించారు. అమ్మ, బ్రహ్మణిల ఆధ్వర్యంలో హెరిటేజ్ మరింత ఉన్నత స్థితికి చేరుతుందని ఆశిస్తున్నాం. హెరిటేజ్ సంస్థతో నా తొమ్మిదేళ్ల ప్రయాణం గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది. అత్యుత్తమ బోర్డు, అద్భుత నిర్వహణ బృందం, సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యపడింది అని అన్నారు.







