విశాఖ వేదికగా తెలుగుదేశం మహానాడు
తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఈ ఏడాది విశాఖ నగరం వేదిక కానున్నట్లు తెలుస్తుంది. మే 27, 28, 29 తేదీల్లో విశాఖలో తెదేపా మహానాడుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. జిల్లాలో 3, 4ప్రదేశాలు ఎంపిక చేస్తే ఒకటి ఎంపిక చేద్దామని నేతలతో అన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జన్మదినం సంధర్భంగా మే నెలలో ప్రతి ఏటా 3రోజులు మహానాడు జరుగుతుంది.








