ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతానికి ఇంతవరకే చెప్పదలచుకున్నానని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన తెలిపారు.అయితే తెలంగాణలో టీడీపీతో పొత్తుపై ఆయన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.








