ఏయూలో మహానాడు
తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదిక సిద్ధమైంది. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో తెలుగుదేశం పండుగ జరగనుంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు ప్రకటించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విశాఖలో మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదు ప్రాంతాలను పరిశీలించిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉన్న ఏయా వైదానాన్ని ఎంపిక చేశామన్నారు.








