తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి
తిరుమల తిరుపతి దేవస్థానం, టాటా గ్రూప్ సంస్థ సహకారంతో తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగింది. టాటా గ్రూపు సంస్థల చైర్మన్ చంద్రశేఖర్ నటరాజన్ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలరంగనాయకుల మండపంలో ఆలయ ఈవో సాంబశివరావుతో సమావేశమయ్యారు. రూ.150 కోట్ల వ్యయంతో 18 నెలల కాలంలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాటా చైర్మన్ ఆలయ ఈవో సాంబశివరావు సత్కరించారు.








