సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి బ్రహ్మూెత్సవాలు
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లు ప్రణాళికా బద్ధంగా జరుగుతున్నాయని అన్నారు. గరుడ సేవ రోజు తిరుమలకు పరిమిత సంఖ్యలో కార్లుకు, పరిమితి దాటి వచ్చే కార్ల కోసం తిరుపతి అలిపిరి సమీపంలో భారతీయ విద్యా భవన్, దేవలోక్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. అక్కడే భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉంచుతామన్నారు. భక్తుల సౌకర్యం కోసం సప్తగిరి సత్రాల నుంచి ఆస్థాన మండపం వరకు నూతన బ్రిడ్జి నిర్మాణం చేపడతామని, సెప్టెంబరు 20లోపు బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామన్నారు.








