సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి బ్రహ్మూెత్సవాలు
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 22న బ్రహ్మూెత్సవాలకు అంకురార్పణ చేసి, 23న చినశేష వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 27న గరుడవాహనం, 28న స్వర్ణరథం, 31న రథోత్సవం ఉంటాయన్నారు. సెప్టెంబర్ 6న పౌర్ణమినాడు గరుడ వాహన సేవ ట్రయల్ రన్ ఉంటుందని తెలిపారు. నూతన స్వర్వభూపాల వాహనం శ్రీవారి సేవకు వినియోగిస్తామన్నారు. గరుడసేవరోజు 24 గంటలపాటు నడకదారి తెరిచి ఉంచుతామన్నారు. ఆగస్టు 1 నుంచి పుష్కరిణి శుభ్రపర్చే కార్యక్రమం చేపడుతామన్నారు.








