నేటి నుంచి శ్రీశైలంలో శరన్నవరాత్రులు
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో తొలిరోజు శ్రీభ్రమరాంబికదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29వ తేదీన స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనుంది. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభ పూజలు జరగనున్నాయి.








