వేడుకగా శ్రీపద్మావతి పరిణయోత్సవం
శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండవ రోజైన శుక్రవారం నాడు వైశాఖవద్ద దశమి. ఇదే అసులు అలనాటి ముహూర్త దినమని పురాణాలు ఘోషిస్తున్నాయి. కనుక ఈ మూడు రోజులు పద్మావతి పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు శ్రీవారు అశ్వ వాహనాన్ని అధిరోహించి సకల సౌర్వభౌమాధికార లాంఛనాలతో బయలు దేరి, వెంట స్వర్ణ పల్లకిలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటి రోజు మాదిరే స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తియిన తరువాత కొలువు జరుగుతుంది. నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తియిన తరువాత కొలువు జరుగుతుంది. ఆ తర్వాత శ్రీవారు దేవేరులతో బంగారు తిరుచ్చిలో తిరువీధుల గుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవ రోజు పరిణయోత్సవ వేడుక ముగుస్తుంది. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.








