ఏపితో స్నాప్ డీల్ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టు కోసం చేతి వృత్తుల కళాకారులకు నేరుగా డిజిటల్ మార్కెట్ సదుపాయం కల్పించడం కోసంకాలిఫోర్నియా యూనివర్శిటీ, బర్క్లీ యూనివర్శిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ దిగ్గజంస్నాప్డీల్ గురువారం ప్రకటించింది.ఈ భాగస్వామ్యంలో భాగంగా స్నాప్ డీల్ తన ప్లాట్ఫామ్ ద్వారా స్థానిక చేనేత కశాకారులకు దేశవ్యాప్తంగాకొనుగోలుదారులతో నేరుగా మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తుందని స్నాప్డీల్ సంస్థకు చెందిన బిజినెస్ టీమ్ వైస్ప్రెసిడెంట్ విశాల్ చద్దా ఒకప్రకటనలో తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా స్థానిక హస్తకళాకారులకు అభివృద్ధి అవకాశాలను కల్పించడమే కాకుండా దేశీయంగా ఉత్పత్తిఅయిన వస్తువులకు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించడం ద్వారా వాటి కీర్తిని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేసేందుకు వీలు కలుగుతుందనిఆయన తెలిపారు.













