సీఎం సెలక్షన్ సూపర్
టీటీడీ ఈవో నియామకం పై ఎన్నడు లేని విధంగా సీఎం పెద్ద ఎత్తున కసరత్తు చేసారు… ఈ సారి ఉత్తరాది వారికి అవకాశం కల్పించాలని ఉత్తరాది ఐఏఎస్ లు… దక్షణాది వారికి అవకాశం కల్పించాలంటూ దక్షణాది ఐఏఎస్ లు రెండుగా చీలిపోయారు. ఒక పక్క ఉత్తరాది నుండి ఏపి సీఎంకు గట్టి ఒత్తిడి.. మరో పక్క మంత్రులు,ఎమ్మెల్యేలు, బ్రాహ్మణ సంఘాలు నుండి సిఫార్స్ లు. దీంతో టీటీడీ ఈవో నియామకం పై అందరి దృష్టిపడింది. పాత విధానాలను పక్కన పెట్టి పనితీరే ప్రామాణికంగా ఉత్తరాది ఐఏఎస్ అనీల్ కూమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా సీఎం నియమించారు. ఎకే సింఘాల్ ను టీటీడీ ఈవో గా ప్రభుత్వం నియమించడం సరికాదన్న వారే ఇప్పడు సీఎం సెక్షన్ సూపర్ అంటున్నారు. ఏపిలో టీడీటీ ఈవో నియామకం పై పెద్ద చర్చజరిగింది.
టీటీడీ ఈవోగా తెలుగు వారికే అవకాశం కల్పించాలని తెలుగు ఐఏఎస్ లు, ఉత్తరాది వారికి అవకాశం కల్పించాలని ఉత్తరాది ఐఏఎస్ లు రెండుగా చీలిపోయి సీఎం పై ఒత్తిడి తెచ్చారు. మరో పక్క నార్త్ ఐఏఎస్ లు కేంద్ర నుండి ఉత్తరాది పెద్దల నుండి గట్టిగా లాబియింగ్ చేసారు. మరో పక్క తెలుగు వారికే దక్కాలంటూ తెలుగు ఐఏఎస్ లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బ్రహ్మణ సంఘాల నుండి సీఎం పై ఒత్తిడి చేసారు. తెలుగు ఐఏఎస్ లు జవహర్ రెడ్డి,జేఎస్వీ ప్రసాద్ లు ఈ పదవి ఆశించారు. జవహర్ రెడ్డికి కొందరు మంత్రులు ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, జేఎస్వీ ప్రపాద్ కోసం మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, బ్రాహ్మణ సంఘాలు కూడా గట్టిగా ప్రయత్నించాయి. దీంతో 20 రోజుల పాటు దీని పై కసరత్తు చేసిన సీఎం పాత విధానాల కన్న పనితీరే ప్రామాణికంగా ఢీల్లీలో ఏపి భవన్ రెసిడెంట్ కమీషనర్ గా పని చేస్తున్న అనీల్ కుమార్ సింఘాల్ ను ఎన్నడు లేని విధంగా టీటీడీ ఈవోగా నియమించారు. దీంతో ఒక్క సారి ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు స్వాగతించలేకపోయారు. వెంకన్న సన్నిధిలో సాంప్రదాయాలు నార్త్ అధికారులకు ఎలా తెలుస్తాయన్నారు. మరో పక్క టీటీడీ పై నార్త్ ఇండియన్స్ పెత్తనం పెరుగుతుందంటానికి ఇదే నిదర్శనమన్నారు. అనీల్ కుమార్ సింఘాలు ఢీల్లీలో ఉండి ఏపి విభజన హమీల అమలు, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాలసిన నిధులు రాబట్టడంలో, కేంద్ర పెద్దలతో ఏపికి సంభందించిన సమస్యల పరిష్కారంకు చేసి కృషి తెలుసుకున్న తర్వాత సీఎం సెలక్షన్ సూపర్ అంటున్నారు. 27 సంవత్సరాలుగా అనీల్ కుమార్ సింఘాల్ ఆంధ్రప్రదేశ్ కి మొరుగైన సేవలు అందించారు. అదికాక తిరుముల వెంకన్న అంటే అమితమైన భక్తి వీడన్నిని దృష్టిలో పెట్టుకుని సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు








