ఎన్నికలకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు
ఎన్నికలకు సహకరించిన వారందరికి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత శిల్పా మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని ఓడించేందుకు టీడీపీ విశ్వప్రయత్నం చేసిందని, చివరి నిమిషంలోనూ గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించిందని ఆయన అన్నారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టినా మేము సంయమనం పాటించామన్నారు.








