ఘనంగా శాకంబరీ ఉత్సవాలు
విజయవాడ దుర్గగుడిలో నేడు శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం కూరగాయల తోరణాలతో కళకళలాడింది. శాకంబరి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈవో సూర్యకుమారి ఈ ఉత్సవాలను ప్రారంభించారు.








