ఏపీలో పెట్టుబడులకు రష్యా ఆసక్తి
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు, రాష్ట్రంతో సంబంధాలు పెంపొందించుకునేందుకు రష్యా ఆసక్తి చూపుతోంది. 30 మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల బృందంతో చెల్యబిన్స్క్ గవర్నర్ ఏప్రిల్లో విశాఖపట్నం లేదా విజయవాడల్లో పర్యటించనున్నారు. చంద్రబాబును కలిసి కార్యచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో చెల్యబిన్స్క్ ప్రతినిధుల బృందం అధికారులతో సమవేశమైంది. తమ పర్యటన విజయవంతం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.







