రోజా సస్పెన్షన్ పై సుప్రీంలో విచారణ
వైకాపా ఎమ్మెల్యే రోజానూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ అమితవరాయ్ నేతృత్వం లోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో క్షమాపణ పత్రాన్ని స్పీకర్‌కు పంపామని రోజా లాయర్ కోర్టుకు తెలిపారు. క్షమాపణ పత్రం తమకు అందలేదని అసెంబ్లీ తరపు న్యాయవాది అన్నారు. కోర్టులోనే అసెంబ్లీ తరపు లాయర్‌కు రోజా క్షమాపణ పత్రాన్ని అందజేశారు. రోజా క్షమాపణ పత్రాన్ని సంబంధిత శాఖలకు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీం ధర్మాసనం సూచించింది. కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున హైకోర్టులో తేల్చుకోవాలని రోజాకు సూచించింది. హైకోర్టులో కేసు ముగిసిన తర్వాత మాత్రమే తాము విచారణకు స్వీకరిస్తామని మరోసారి సృష్టం చేసింది.








