ఏపీలో స్థానిక ఎన్నికలు …మేయర్, మున్సిపల్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు, మున్సిపాలిటీలలో ఛైర్పర్సన్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు, 106 మున్సిపాలిటీలలో ఛైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేటాయింపుల ప్రకారం మేయర్ పదవులలో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీకి 1, జనరల్ మహిళలకు 5, అన్రిజర్వ్డ్ కోసం 4 స్థానాలు కేటాయిస్తూ కేటాయిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్లు – మేయర్ రిజర్వేషన్
మంగళగిరి తాడేపల్లి – ఎస్టీ
రాజమహేంద్రవరం – ఎస్సీ
కర్నూలు – ఎస్సీ
మచిలీపట్నం – బీసీ మహిళ
కాకినాడ – బీసీ మహిళ
ఏలూరు – బీసీ జనరల్
అనంతపురం – బీసీ జనరల్
చిత్తూరు – బీసీ జనరల్
విజయనగరం – జనరల్ మహిళ
శ్రీకాకుళం – జనరల్ మహిళ
గుంటూరు – జనరల్ మహిళ
కడప – జనరల్ మహిళ
విశాఖపట్నం – జనరల్ మహిళ
తిరుపతి – అన్రిజర్వ్డ్
విజయవాడ – అన్రిజర్వ్డ్
ఒంగోలు – అన్రిజర్వ్డ్
నెల్లూరు – అన్రిజర్వ్డ్
మరోవైపు రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీలకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిది. వీటిలో ఎస్టీ జనరల్ 2, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 7, ఎస్సీ మహిళ 7, బీసీ జనరల్ 18, బీసీ మహిళ 18, జనరల్ (అన్రిజర్వ్డ్) 26, జనరల్ మహిళలకు 27 స్థానాలను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.








