జాతీయ సరస్ మేళాకు మంత్రి లోకేష్ కు ఆహ్వానం
అమరావతి: విజయవాడ పున్నమిఘాట్ లో ఈ నెల 13 నుంచి 31వ తేదీ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ సరస్ మేళాకు హాజరుకావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి కు ఆహ్వానం పలికారు. ఈ మేరకు సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, మెప్మా ఎండీ జి.బాలకృష్ణ, దేశంలోని పొదుపు సంఘాల మహిళల తరపున ఎన్టీఆర్ జిల్లా డీఆర్ డీఏ జిల్లా సమాఖ్య అధ్యక్షులు కల్పన.. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతీయ సరస్ మేళా మొట్టమొదటిసారిగా విజయవాడలో జరగనుంది. ఈ మేళాలో అన్ని రాష్ట్రాల నుంచి వారి స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు జరుగుతాయి. ఈ నెల 15వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ మేళా ప్రారంభం కానుంది. మంత్రి లోకేష్ ను ఆహ్వానించిన వారిలో ఎన్టీఆర్ జిల్లా డీఆర్ డీఏ జిల్లా సమాఖ్య ఉపాధ్యక్షులు ఎన్.బేబీ, కార్యదర్శి బి.రామలక్ష్మి, కోశాధికారి సీహెచ్ హైమావతి తదితరులు ఉన్నారు.








