బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్ధికి విప్రో సహకారం
బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి విప్రో సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంరద్బంగా సచివాలయంలో ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌తో విప్రో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో కోర్ డ్యాష్ బోర్డుతోనే ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్ష చేసే విధంగా డ్యాష్ బోర్డు అభివృద్ధికి సహకారం అందిస్తామని విప్రో ప్రతినిధులు తెలిపారు. విశాఖపట్నం క్యాంపస్‌లో 1500 మందికి ఉపాధి కల్పిస్తున్నామని, త్వరలో రెండవ దశ పనులు ప్రారంభించి మరో 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి దృష్టికి విప్రో ప్రతినిధులు తీసుకువెళ్లారు. కావాల్సిన అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగాఉల కల్పించాలని విప్రో ప్రతినిధులును కోరారు.








