డిప్యూటీ కలెక్టర్ గా పీవీ సింధు!
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఆమెకు గ్రూపు-1 ఉద్యోగాన్ని ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఆమె డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం పట్ల ఆసక్తిని కనబరిచారు. దీనిపై ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు కమిషన్ ఆమోదం తెలిపిందని అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్ తెలిపారు. ఈ సమావేశంలో 1999 గ్రూపు-2 ఉద్యోగాల వ్యవహాంపైనా చర్చించారు. ఎంపిక చేసిన జాబితాల సమాచారాన్ని సంబంధిత శాఖలకు తెలియచేశారు.













