సింధును అభినందించిన సీఎం చంద్రబాబు
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించని పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. మరిన్ని పతకాలు సాధించి భారతదేశ, ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు నిలపాలని ఆకాంక్షించారు. వెలగపూడిలోని సచివాలయంలో తన శిక్షకుడు గోపిచంద్‌తో కలిసి ఆమె ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. బ్యాడ్మింటన్ క్రీడలో మరిన్ని విజయాలు, రికార్డులు సాధించేందుకు రాష్ట్రం ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని చంద్రబాబు అన్నారు. డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలను సైతం సమర్థమంతంగా నిర్వహించగలిగే సత్తా సింధుకు ఉందని ప్రశంసించారు. అమరావతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు అంశాలపై గోపిచంద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా అకాడమీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.








