అధిష్ఠానం ఆదేశిస్తే అనంతపురం నుంచి పోటీ చేస్తా
బీజీపీ కేంద్ర నాయకత్వం ఆదేశిస్తే అనంతపురం జిల్లా నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఆమె అనంతపురం జిల్లా ఉరవకొండలో మీడియాతో మాట్లాడారు. ఉన్నత నాయకత్వం ఆదేశిస్తే ఏ జిల్లాలోనైనా పోటీ చేస్తానని తెలిపారు. అలాగే బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి అందిస్తున్న సహకారం గురించి వివరించారు.








