మహానాడు కు భూమి పూజ
తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కార్యక్రమానికి సంబంధించిన పనులకు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భూమిపూజ చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి కళా వెంకటరావు, మంత్రులు చినరాజప్ప, జవహార్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్కుమార్, అనిత, ఎమెల్సీలు డాక్టర్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, పప్పల చలపతిరావు, ఎం.పి అవంతి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్మన్ భవానీ పాల్గొన్నారు. వీరంతా భక్తిశ్రద్ధలతో భూమిపూజ, రాట మహోత్సవాన్ని నిర్వహించి శంఖం పూరించారు. అనంతరం మీడియాతో చినరాజప్ప, జవహర్లు మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రతిష్ఠాత్మకంగా మహానాడు జరుగుతుందని అన్నారు. మహానాడులో మొత్తం 14 తీర్మానాలను చేయనున్నామని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో సుమారు 20వేల మంది వరకు పాల్గొనే అవకాశం ఉందన్నారు. మహానాడులోనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని తెలిపారు.








