ఏపీకి సమగ్రాభివృద్ధి అవార్డు
పర్యాటక రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ టూరింజం శాఖకు జాతీయ అవార్డు లభించింది. రాష్టప్రతి చేతుల మీదుగా పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఆంధ్రభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ విభాగంలో ఏపీ తరువాత రాజస్థాన్, గోవా, కేరళ రాష్ట్రాలు వరసగా నిలిచాయి. ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఇబ్బందులను సైతం అధిగమించి సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఒక నూతన రాష్ట్రం జాతీయ స్థాయిలో ఈ స్థానాన్ని దక్కించుకోవటం ప్రభుత్వ సత్తాను వెల్లడిస్తోందని ఆయన పేర్కొన్నారు. పర్యాటక అనుకూల విధానాలతో నిత్యనూతనంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించటంలో రాష్ట్ర పర్యాటక శాఖ ముందు వరసలో ఉందని చెప్పారు.








