వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
పౌర్ణమి సందర్భంగా తిరుమలలో బుధవారం రాత్రి గరుడ సేవ వైభంగా జరిగింది. భక్తుల కోసం ప్రతినెలా పౌర్ణమి పర్యదినాన తిరుమల తిరుపతి దేవస్థాం (టీటీడీ) గరుడ సేవ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు దగదగా మెరిసి పోతున్న గరుడుని పై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ఇన్చార్జ్ జేఈవో పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో కోదండరామారావు, విజిఓ రవీంథ్రారెడ్డి, విఎస్ఓలు విమలాకుమారి, సదాలక్ష్మి, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.








