ముద్రగడను అడ్దుకున్న పోలీసులు
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను బలగాలు మరోసారి అడ్డుకున్నాయి. గురువారం ఉదయం కిర్లంపూడిలో స్వగృహం నుండి పాదయాత్ర చేసేందుకు కాపు జెఏసి నేతలతో బయటకు వస్తుండగా ఇంటి ప్రధాన ద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. 2009లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి పాదయాత్రకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కొన్ని పత్రాలను ముద్రగడ చేతికి అందించేందుకు ప్రయత్నించారు. ఆ పత్రాలను తీసుకునేందుకు అంగీకరించని ముద్రగడ పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.








