విలువైన భాగస్వామి టీడీపీకి ప్రధాని అభినందనలు
నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. నంద్యాలలో భారీ విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి, మా విలువైన ఎన్డీయే భాగస్వామి తెలుగుదేశంకు అభినందనలు అని ట్విట్టర్లో ప్రధాని ట్వీట్ చేశారు. దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు సైతం నంద్యాల విజయంపై చంద్రబాబుకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.








