చంద్రబాబుతో భేటీ అయిన జనసేనాని..
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రతి పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి సిద్ధపడిపోతోంది. మంతనాలు ఒకపక్క.. రాబోయే ఎన్నికల లెక్కల కసరత్తు మరొకపక్క.. ఎక్కడ చూసినా స్ట్రాటజీల మాయే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేనాని భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ ఆయన్ను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై వీళ్ళిద్దరూ చర్చించుకున్నారని టాక్. వీటితో పాటుగా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న అభ్యర్థుల లిస్టు.. ఎన్నికల ప్రచారం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై కూడా చర్చలు జరిగాయట. ఈసారి కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు మూకుమ్మడిగా ప్రచారాన్ని నిర్వహించడానికి సిద్ధపడుతున్నాయి. ఇక సభలు, సమావేశాలు ఏ ప్రాంతాల్లో నిర్వహించాలి అనే విషయంపై కూడా డిస్కషన్ జరుగుతోంది. రాబోయే 50 రోజులు ఎన్నికలకు ఎంతో కీలకమైనవి. చిలకలూరిపేట లో జరిగిన సభ తర్వాత తిరిగి ఈ ఇద్దరు నేతలు కలిసింది ఈ రోజే. భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ తో మాట్లాడే అవకాశం ఉంది.













