ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య వన్నెతెస్తారు : పవన్ కల్యాణ్
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడికి సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు బిడ్డ, సీనియర్ రాజకీయ నాయకుడిగా అపరా అనుభవం కలిగిన వెంకయ్య ఉప రాష్ట్రపతి పదవికి వన్నెతెస్తారని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది తెలుగువారందరూ గర్వించదగ్గ పరిణామమని, తెలుగువారికి దక్కిన ఆరుదైన గౌరవంగా భావిస్తున్నాని తెలిపారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ఎంపిక చేసినందుకు బీజేపీ అధినాయకత్వాన్ని అభినందించారు.













