31న సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చించనున్నారని తెలిసింది. పవన్‌కల్యాణ్ ఇప్పటికే హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి చెందిన వైద్యులతో ఈ అంశంపై చర్చించారు. స్కూల్ ప్రతినిధి బృందం 29న ఉద్దానంలో పర్యటించనుంది.








