ఈ నెల 30 లేదా 31న సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ
ఈ నెల 30 లేదా 31న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భేటీ కానున్నట్లు తెలిసింది. ఉద్దానం సమస్యపై హార్వర్డ్ యూనివర్సీటీ వైద్యులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భేటీకానున్నారు. ఉద్దానం సమస్యపై బాధిత కుటుంబాలు ఇప్పటికే పవన్‌ను జనసేన కార్యాలయంలో కలిసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కూడా స్వయంగా ఉద్దానం వెళ్లి అక్కడి కిడ్నీ పాడైన బాధితులు, బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వంలో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి బాధితులు పడుతున్న కష్టాలను వివరించనున్నారు. ప్రభుత్వం కూడా ఉద్దానంలో పరిస్థితులపై ఇప్పటికే సమీక్ష జరిపింది. జిల్లా మంత్రులు కూడా స్పందించారు.








