చంద్రశేఖర్‌కు పవన్ కళ్యాణ్ పాదాభివందనం
జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ తనకు పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని తరచూ చాటుకుంటూనే ఉంటారు. తాజాగా, ఉద్దానం ప్రజల కిడ్నీ బాధలను రూపుమాపేందుకు తనవంతుగా కృషి చేస్తున్న సీనియర్ డాక్టర్ చంద్రశేఖర్‌కు పాదాభివందనం చేసి మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈ సమయంలో అభిమానులు, ప్రజలు హర్షధ్వానాలు చేశారు. కాగా, హార్వర్డ్ నుంచి వచ్చిన మరో తెలుగు డాక్టర్ వెంకట్ సుబ్బిశెట్టి ఇక్కడి పరిశోధనలకు అండగా నిలుస్తున్నారని పవన్ ప్రశంసించారు.








