పవన్ మంచోడు.. తమకు మద్దతివ్వటం సంతోషం కల్గించింది
మూడేళ్ల టీడీపీ పాలనపై ప్రజలు విరక్తి చెందారని హోదా భరోసా సభ నిరూపించిందని రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ సభను అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నించినా సభ విజయవంతం అయిందని అన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా మంచోడు అని తమ సభకు మద్దతివ్వటం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. హోదా విషయంలో పవన్ ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు ముందుకేయటానికి తాము సిద్ధమన్నారు.








