నంద్యాల ఉపఎన్నికలో పవన్ నిర్ణయం ఏమిటో తెలుసా?
నంద్యాల ఉప ఎన్నికలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా టీడీపీకి మద్దతు ఇస్తారని అందరూ భావిస్తుండగా, తాను ఏ పార్టీకి మద్దదు ఇవ్వడం లేదని ప్రకటించారు. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని పేర్కొన్నారు. తమ మద్దతు ఉందని ఎవరైనా చెప్పుకుంటే అది తప్పని, జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తానే ప్రకటిస్తానని సృష్టం చేశారు. ఉప ఎన్నిక కాబట్టి ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని అన్నారు. పార్టీ నిర్మాణం జరిగే వరకూ ఏ ఎన్నికల్లో పోటీ చేయబోమని, 2019 ఎన్నికలే తమ టార్గెట్ అని సృష్టం చేశారు.








