సీఎం చంద్రబాబుకు పట్టిసీమ పాయసం
పట్టిసీమ తమ పాలిట దివ్వవరం అని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు. తాము పండించిన పంటలతో వండి తీసుకొచ్చిన పాయసం, అటుకులు, ధాన్యాలను ముఖ్యమంత్రికి ప్రేమతో అందించారు. ఈ రోజు అసెంబ్లీకి వచ్చిన రైతులు పట్టిసీమ జలాల రాకతో తామెంతో సంతోషంగా ఉన్నామని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో పట్టిసీమకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అనుకున్న సమయానికి పోలవరంను కూడా పూర్తిచేసి రాష్ట్రంలో కరువును శాశ్వతంగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు.













