త్వరలో ‘బాలామృతం’
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ‘బాలామృతం’ పథకాన్ని ప్రారంభింప చేస్తామని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ఈ పథకం కింద 7 నెలల నుంచి మూడేళ్లలోపు 14లక్షల 15వేల మంది పిల్లలకు నెలకు రెండున్నర కిలోల పౌష్టికారాన్ని అందిస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రతినెలా 22 కోట్ల నిధులు అవసరమవుతాయని, ఏడాదికి 264 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని 7 లక్షల 40వేల మంది బాలింతల సంక్షేమానికి ఏటా రూ. 431 కోట్లతో ప్రభుత్వం ‘అన్న అమృతహస్తం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, అవకతవకలు జరక్కుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులను హెచ్చరించారు.








