ఉపరాష్రప్టతికి పరిటాల శ్రీరామ్ వివాహా ఆహ్వానం
పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరుకావాలని కోరుతూ ఆయన మాతృమూర్తి, ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్లోని రాజ్భవన్లో వెంకయ్యనాయుడిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకూ ఆహ్వాన పత్రికలు అందజేసి శ్రీరామ్ వివాహానికి రావాలని కోరారు.








