సీఎం చంద్రబాబును ఆహ్వానించిన పరిటాల శ్రీరామ్
పరిటాల కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి సునీతల తనయుడు శ్రీరామ్ వివాహం అక్టోబరు 1న జరగనుంది. ఈ నెల 10న నిశ్చితార్ధానికి ముహూర్తం ఖరారైంది. మంత్రి సునీత, శ్రీరామ్, సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నిశ్చితార్థ మహోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్లోని ఎన్కన్వెన్షన్ హాల్ నిశ్చితార్థ వేడుక జరగనుంది. శ్రీరామ్ వివాహం శింగనమల నియోజకవర్గం నార్పల మండలం ఏవీఆర్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానతో జరగనుంది.













