త్వరలో పరిటాల శ్రీరామ్ వివాహం
ఎంతోమంది పేదల వివాహాలు జరిపించిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహ మహోత్సవం అక్టోబర్ 2న వెంకటాపురంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి పరిటాల సునీత తెలిపారు. రామగిరి మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ వివాహ నిశ్చయ కార్యక్రమం ఆగస్టు 10వ తేదీన వుంటుందన్నారు. కాగా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రమణ కుమార్తె జ్నానవితో పరిటాల వివాహాం నిశ్చయమైనట్లు తెలిసింది. ఈమె చెన్నైలో విద్యాభాస్యం సాగించి అక్కడే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.













