చంద్రబాబుకున్న చరిష్మా ఏ రాజకీయనేతకూ లేదు
అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ రాజకీయనేతకూ లేని చర్మిషా ఉందని చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా భారతవాణిజ్య మండలి 2017 అవార్డును చంద్రబాబు అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. టెక్నాలజిని గతంలో సిఎంగా ఉన్నప్పుడే బాబు ప్రోత్సహించడంతో లక్షలాదిమంది అమెరికాలో నేడు ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. కాగా వైసిపి ప్రోద్భలంతో ఇ మెయిల్స్ ఆ దేశ ప్రజాప్రతినిధులకు పంపి కుట్ర పన్నేందుకు ప్రయత్నం జరిగిందని అయితే ఇది బయటకు పొక్కడంతో ఆ పార్టీ ప్రతిష్ట మరోసారి దిగజారిందన్నారు. సోషయల్ మీడియాలో సిఎం, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్ర చర్యలు తప్పవన్నారు. విభజన తరువాత రాష్ట్రాన్ని చంద్రబాబు కష్టపడి అభివృద్ధి చేస్తుండగా పురాణాల్లో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్లుగా జగన్ అండ్ కో వ్యవహరిస్తోందని విమర్శించారు.








